India’s fuel demand: ఆర్థిక రికవరీ… భారీగా పెరిగిన పెట్రోల్ వినియోగం
మార్చి నెలలో చమురు వినియోగం (India's fuel demand) భారీగా పెరిగింది. ఏడాది ప్రాతిపదికన గత మార్చి నెలలో చమురు వినియోగం 5 శాతం పెరిగి 4.83 మిలియన్ బ్యారెళ్లకు లేదా 20.5 మిలియన్ టన్నులకు పెరిగింది.
కరోనా మహమ్మారి (Covid 19) అనంతరం నరేంద్ర మోడీ పాలన (PM Narendra Modi) చేపట్టిన చర్యలతో భారత్ వేగవంతంగా రికవరీ అవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా మార్చి నెలలో చమురు వినియోగం (India’s fuel demand) భారీగా పెరిగింది. దీంతో ఆర్థిక కార్యకలాపాలు (Strong Economic Activity in India) వేగంగా పెరుగుతున్నాయని… పెరిగాయనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఏడాది ప్రాతిపదికన గత మార్చి నెలలో చమురు వినియోగం 5 శాతం పెరిగి 4.83 మిలియన్ బ్యారెళ్లకు లేదా 20.5 మిలియన్ టన్నులకు పెరిగింది. 1998లో డేటాను రికార్డ్ చేయడం ప్రారంభించినప్పటి నుండి అత్యధిక వినియోగం ఇదేనని కేంద్ర చమురు శాఖ నివేదిక వెల్లడిస్తోంది. మార్చి నెలలో గ్యాసోలైన్ లేదా పెట్రోల్ 6.8 శాతం పెరిగి 3.1 మిలియన్ టన్నులకు పెరిగింది. కుకింగ్ గ్యాస్ లేదా ఎల్పీజీ మాత్రం 2.7 శాతం తగ్గి 2.41 మిలియన్ టన్నులుగా నిలిచింది. చమురు వినియోగం నెల ప్రాతిపదికన అంటే ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో 2 శాతం పెరిగింది.
రోడ్ల నిర్మాణానికి వినియోగించే బిటుమెన్ సేల్స్ ఫిబ్రవరి నెలలో 16.5 శాతం పెరిగింది. జెట్ ప్యూయల్ సేల్స్ 10.4 శాతం పెరిగి 0.69 మిలియన్ టన్నులకు (jet fuel sales rose more than 10.4 per cent to 0.69 million tonnes), డీజిల్ సేల్స్ 11.4 శాతం పెరిగి 7.80 మిలియన్ టన్నులకు పెరిగింది (diesel sales were up 11.4 per cent to 7.80 million tonnes). భారత చమురు వినియోగం పెరుగుదల లేదా తగ్గుదల దేశ ఆర్థిక రికవరీని వెల్లడిస్తుంది.
ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ అనలిస్ట్స్ మాట్లాడుతూ… ప్రభుత్వం పెంచిన మూలధన వ్యయ కేటాయింపుల వల్ల వినియోగం పుంజుకుందని భావించవచ్చునని చెబుతున్నారు. నిర్మాణం, మౌలిక సదుపాయాలకు భారీ డిమాండ్, ముఖ్యంగా ఎన్నికలకు ముందు సంవత్సరంలో చమురు ఉత్పత్తులకు మరింత డిమాండ్ రావడానికి కారణమని చెబుతున్నారు. రష్యాపై పాశ్చాత్య ఆంక్షల నేపథ్యంలో యూరప్‌కు పెరిగిన చమురు ఉత్పత్తుల ఎగుమతులు మరియు ప్రయాణ పునరుద్ధరణ జెట్ ఇంధన డిమాండ్‌ను పెంచడం అదనపు డ్రైవర్లుగా మారవచ్చని చెబుతున్నారు.