Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. రోజూ కాస్తయినా తగ్గుతున్నాయి. బంగారం నామ మాత్రంగా తగ్గుతూ వస్తోంది. వెండి మాత్రం బుధవారం భారీగా తగ్గుముఖం పట్టింది. ఏ లోహం ధర ఎంత ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం. నేడు దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ.140 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.73,770కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లోనూ పసిడి ధర(Gold Rate) దాదాపుగా ఇలాగే కొనసాగుతోంది. విజయవాడ, ప్రొద్దుటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి చోట్లా ధరలు ఇలానే ఉన్నాయి. ఈ ధరలు తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ పేర్కొన్న రేటు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నదని వినియోగదారులు గుర్తుంచుకోవాలి.
ఇక బుధవారం దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate) మాత్రం వెయ్య రూపాయలకు పైగా తగ్గింది. ఈ ఒక్క రోజే రూ.1513 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర నేడు రూ.89332కు చేరుకుంది. మళ్లీ తొంభై వేల దిగువకు చేరుకుంది. విజయవాడ, ప్రొద్దుటూరు, విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి చోట్లా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ సైతం రేట్లు తగ్గాయి. ఔన్సు స్పాట్ గోల్డు ఎనిమిది డాలర్లు తగ్గి 2317 డాలర్లుకు చేరుకుంది. ఔన్సు వెండి 28.95 డాలర్లు పలుకుతోంది.