Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఇక్కడ చదివేయండి. దేశీయ మార్కెట్లో గురువారం పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.10 తగ్గి రూ.57,580కి చేరింది. బుధవారం ఈ ధర రూ.57,590గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం 5,758గా ఉంది.
అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర(Gold Rate) కూడా రూ.10 తగ్గి రూ. 62,820 కి చేరింది. బుధవారం ఇది రూ. 62,830గా ఉంది. ప్లాటినం రేట్లు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 180 తగ్గి.. రూ. 23,450 కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,630 గా ఉండేది. హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,580 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,820 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే దేశీయ మార్కెట్లో వెండి ధర(Silver Rate) కూడా గురువారం స్వల్పంగా తగ్గింది. రూ. 100 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర 73,800 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 73,900 గా ఉండేది.