ఎన్టీఆర్: మైలవరంలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా డొమెస్టిక్ బయోమెట్రిక్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ జిల్లా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. మూడు నెలల పాటు నిర్వహించే ఉచిత శిక్షణకు పది, ఆపైన చదివిన వారు అర్హులని పేర్కొన్నారు.