బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.345తో 60 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. రోజుకూ 1GB డేటా, 100 SMSలు ఉంటాయి. అపరిమిత కాలింగ్ పొందొచ్చు. అయితే, ఇందులో BSNL ట్యూన్స్, హర్డీ గేమ్స్ సదుపాయాలు ఉండవు. ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ టారిఫ్లను పెంచడంతో చాలామంది యూజర్లను దృష్టిలో పెట్టుకొని BSNL కొత్త ప్లాన్లపై దృష్టి సారించింది.