»An American Who Made A Bike That Runs On Beer Is Rushing At A Speed Of 240 Kilometers Per Hour
Beer Bike: బీరుతో నడిచే బైక్.. ఆవిష్కరించిన అమెరికా వాసి
ఇప్పటి వరకు మనం వాడే బైకులన్నీ పెట్రోల్ సాయంతోనే నడుస్తాయి. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్ ల వాడకం విపరీతంగా పెరిగింది. ఇలా పెట్రోల్, కరెంటుతో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు.
Beer Bike: ఇప్పటి వరకు మనం వాడే బైకులన్నీ పెట్రోల్(Petrol) సాయంతోనే నడుస్తాయి. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్(Electric bike) ల వాడకం విపరీతంగా పెరిగింది. ఇలా పెట్రోల్, కరెంటు(Current)తో అమెరికాకు చెందిన ఓ వ్యక్తి కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. దానిపై రీసెర్చ్ చేసి ఏకంగా బీరుతోనే నడిచే బైక్(Beer Bike) తయారు చేశాడు. ఇప్పుడు ఈ ఆవిష్కరణ సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన కై మైఖేల్సన్(Kai Michaelson) అనే వ్యక్తి గతంలో అసాధారణ ఆవిష్కరణలతో సంచలనం సృష్టించాడు. అతనే ఈ బీర్ తో నడిచే బైక్ రూపొందించాడు. కై మైఖేల్సన్ గతంలో రాకెట్ ఆధారిత టాయిలెట్(toilet), జెట్ ఆధారిత కాఫీ కుండను కనిబెట్టాడు. ఈ కొత్త ఆవిష్కరణలో గ్యాస్(gas) ఆధారితంగా నడిచే ఇంజన్(Engine) కు బదులు.. హీటింగ్ కాయిల్ తో కూడిన 14 గ్యాలన్ కెగ్ అమర్చాడు. అయితే అందులో బీర్ పోయగానే.. దానిని కాయిల్ 300 డిగ్రీల వరకు వేడి చేస్తుంది. అది నాజిల్స్ లో సూపర్-హీటెడ్ ఆవిరిగా మారుతుందని కై మైఖేల్సన్ చెప్పారు. దీని వల్ల బైక్ ముందుకు కదులుతుందని వివరించాడు.
ఈ బైక్ ప్రస్తుతం బ్లూమింగ్టన్(Bloomington) లోని అతడి గ్యారేజీలో ఉంది. ఈ బైక్ తయారీ విధానంపై మైఖేల్సన్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ సృజనాత్మకంగా ఉండటానికి ఇష్టపడతానన్నాడు. ఈ మోటార్ సైకిల్ ఖచ్చితంగా భిన్నంగా ఉంటుందన్నాడు. తాను నివాసముంటున్న ప్రాంతంలో గ్యాస్ ధర పెరుగుతోంది. తనకు బీర్ తాగే అలవాటు లేనందున దానిని ఎందుకు ఇంధనంగా ఉపయోగించకూడదనే ఆలోచనతో ఈ బైక్ రూపొందించినట్లు తెలిపాడు.
కాగా.. రాకెట్ మ్యాన్(Rocket Man) అని ముద్దుగా పిలుచుకునే కేయ్.. తన బైక్ ను ఇప్పటి వరకు రోడ్డుపైకి తీసుకురాలేదు. కానీ బీర్ తో నడిచే ఈ వాహనం కొన్ని లోకల్ కార్ షోలలో చోటు దక్కించుకుంది అక్కడ ఇది మొదటి స్థానాన్ని గెలుచుకుంటోంది. ఈ బైక్ గంటకు 240 కిలోమీటర్లు వేగంతో దూసుకెళ్లగలదని ఆయన చెప్పారు. త్వరలోనే ఈ బైక్ ను డ్రాగ్ స్ట్రిప్ లోకి తీసుకెళ్లి దాని సామర్థ్యాలను పరీక్షించాలని తాను చూస్తున్నాని పేర్కొన్నారు.