TG: రాష్ట్రంలో MBA, MCA సీట్ల భర్తీకి ఈ నెల 30 నుంచి ఐసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 30న ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్, అక్టోబరు 1న ధ్రువపత్రాల పరిశీలన, 1,2 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. అక్టోబరు 4వ తేదీలోపు సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. స్పాట్ ప్రవేశాల మార్గదర్శకాలను 6న వెబ్ సైట్లో ఉంచుతామని తెలిపారు.