TG: గ్రూప్-2 783 పోస్టులకు సంబంధించి 4వ విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలను TGPSC ప్రకటించింది. తెలుగు తెలుగు వర్సిటీలో ఈ నెల 23-25 తేదీల్లో వెరిఫికేషన్ జరుగుతుందని, ఈ ప్రక్రియకు ఎంపికైన 193 మంది అభ్యర్థుల జాబితా కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది. ఇక ఎంపికైన అభ్యర్థులు ఈ తేదీల్లో వెరిఫికేషన్‌కు రాకపోతే తర్వాతి విడతలో పరిగణించబడరని స్పష్టం చేసింది.