నూతనంగా తీసుకువచ్చిన ఏఐ ద్వారా 800 కోట్ల ఫోన్ కాల్స్‌పై వినియోగదారులను హెచ్చరించినట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. అంతేకాకుండా 80 కోట్లకు పైగా మోసపూరిత సందేశాలను గుర్తించినట్లు తెలిపింది. తద్వారా స్పామ్ కాల్స్‌కు సమాధానం చెప్పే వినియోగదారుల సంఖ్య 12 శాతం వరకు తగ్గినట్లు పేర్కొంది. ఈ స్కామర్లు ఎక్కువగా ల్యాండ్‌లైన్ నుంచే మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించింది.