VZM: భోగాపురం మండలం కొండ రాజుపాలెం గ్రామానికి చెందిన గనగళ్ల దానయ్య సముద్రంలో గల్లంతయ్యాడు. గురువారం ఉదయం ముగ్గురు స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లాడు. దానయ్య గల్లంతుకావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దానయ్య రామచంద్రపేట హైస్కూల్లో పదోతరగతి చదువుతున్నాడు.