AP: వైఎస్సార్ కడప జిల్లాలో అర్ధరాత్రి 3 చోట్ల దొంగలు బీభత్సం సృష్టించారు. కడప నగరంతోపాటు ఒంటిమిట్టలోని ATMలలో చోరీలకు పాల్పడ్డారు. ఒంటిమిట్టలోని ATMలో దుండగులు రూ.36 లక్షలు చోరీ చేశారు. కడప ద్వారకానగర్‌లోని ATMలో రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. విశ్వేశ్వరయ్య కూడలిలో మరో ATM వద్ద చోరీకి యత్నించారు. ఘటన జరిగిన ప్రదేశాలను పోలీసులు, బ్యాంకు సిబ్బంది పరిశీలించి.. చోరీలకు పాల్పడినవారు హర్యానాకు చెందిన ముఠాగా గుర్తించారు.