ప్రకాశం: జరుగుమల్లి మండలం వాగులేటిపాడు గ్రామ సమీపంలో లారీ ఢీ కొని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. సింగరాయకొండకు చెందిన బి శ్రీనివాసులు(43) టంగుటూరు వైపు వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు. చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.