కృష్ణా: పామర్రులో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామర్రు నుంచి కత్తిపూడి నేషనల్ హైవే కొత్త పెదమద్దాలి గ్రామం వద్ద కారు అదుపు తప్పింది. రోడ్డుపక్కనే ఉన్న కాలువలోకి కారు దూసుకుపోయినట్లు స్థానికులు వెల్లడించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోయినట్లు తెలిపారు.