»Ys Sharmila Fire On Narendra Modi Not Fulfill Promises Off Telangana
ప్రధాని Narendra Modiపై షర్మిల అసంతృప్తి.. బాధాకరం అంటూ ట్వీట్
తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఈ సభలోనైనా నిధులు ప్రకటించాలని కోరుతున్నాం. మీ రాజకీయ స్వార్థం కోసం ప్రజల సొమ్మును పణంగా పెట్టడం విచారకరం.
తొమ్మిదేండ్లు కావొస్తున్న విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధకరమంటూ ప్రధాని మోదీపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలోనైనా తెలంగాణకు (Telangana) నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Narendra Modi) షర్మిల స్వాగతం పలికింది. ఈ సందర్భంగా కేసీఆర్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని పర్యటన సందర్భంగా షర్మిల చేసిన ట్వీట్ ఇలా ఉంది.
‘ప్రధాని మోదీకి తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ స్వాగతం పలుకుతోంది. తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. బడ్జెట్ లోనూ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఈ సభలోనైనా తెలంగాణకు నిధులు ప్రకటించాలని కోరుతున్నాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ‘కాళేశ్వరం కేసీఆర్ (KCR)కు ఏటీఎం’ అని బీజేపీ నాయకులు బుకాయిస్తున్నారు కానీ విచారణ చేయడం లేదు. మా పార్టీ కాళేశ్వరం అవినీతిపై ఢిల్లీకి వెళ్లి పోరాటం చేసింది. కాగ్, సీబీఐకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేవు. మీ రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ప్రజల సొమ్మును పణంగా పెట్టడం విచారకరం. ప్రధాని రాష్ట్రానికి వస్తే ఎదురెళ్లి సమస్యలు పరిష్కరించండి అని నిలదీసే దమ్ము కేసీఆర్ కు లేదు. చేతకాని దద్దమ్మలా ఫామ్ హౌజ్ కే పరిమితమై, ప్రధాని వెళ్లిపోయాక అవాకులు, చెవాకులు పేల్చడం కేసీఆర్ కు అలవాటుగా మారింది. కేసీఆర్ రాజకీయాలు, మొండివైఖరితో తెలంగాణకు అన్యాయమే జరుగుతోంది’ అని షర్మిల ట్విటర్ లో పోస్టు చేశారు.
ప్రధాని శ్రీ @narendramodi గారికి తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ స్వాగతం పలుకుతోంది. తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. బడ్జెట్ లోనూ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఈ సభలోనైనా తెలంగాణకు నిధులు ప్రకటించాలని కోరుతున్నాం. 1/3