అధికారంలో ఉన్న ప్రభుత్వం.. తాము చేస్తున్న ప్రతి పనిలోనూ తమ మార్క్ కనిపించేలా చేసుకుంటుంది. ప్రజలకు అందించే స్కీమ్ ల్లోనూ.. అందించే సరుకుల్లోనో.. ఇలా ఏదో ఒక రూపంలో.. తమ గుర్తు జనాల్లోకి మరింత వెళ్లేలా జాగ్రత్తలుు తీసుకుంటుంది. ఇదే ఫార్ములా అందరూ పాటిస్తారు. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మాత్రం ఈ విషయంలో మరీ అతి చేస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
అయితే.. ఇది స్వయంగా ప్రభుత్వ పని అని చెప్పలేం.. ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్న పనే. వైసీపీ అధికారంలోకి రాగానే.. అన్ని భవానాలకూ ఆ పార్టీ రంగులు వేయించారు. అక్కడి వరకూ బాగానే ఉంది. ఇప్పుడు.. వినాయక చవితి సందర్భంగా తయారు చేస్తున్న వినాయక విగ్రహాలకు సైతం అవే రంగులు వేయించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
వినాయకుడికి.. కూడా వైసీపీ రంగులు పులిమేసి.. తమ పార్టీ పిచ్చిని.. వినాయకుడికి కూడా పట్టించేసి.. ఇలా తయారు చేశారు. వినాయక చవితికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటో చూసి.. ఎక్కువగా విమర్శలే వినిపిస్తుండటం గమనార్హం. మరి దీనిని ఆపుతారో.. అన్ని వినాయకులకూ ఇదే రంగు పూస్తారో చూడాలి.