సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ అత్యంత ఇష్టపడే ఆన్-స్క్రీన్ పెయిర్లలో ఒకరైన వీరు టైగర్ 3(tiger3)లో కనిపించబోతుంది. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అవెంజర్స్ మూవీతో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ కో ఆర్డినేటర్ చేరడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సల్మాన్ ఖాన్ యాక్షన్ ఎంటర్టైనర్ టైగర్ 3(Tiger 3) కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. సల్మాన్ ఖాన్ చిత్రాల ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై ఫ్రాంచైజీ జోనర్ లో ఇది మూడోది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ కథానాయికగా నటిస్తుండగా, షారూఖ్ ఇందులో పవర్ ఫుల్ క్యామియోలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఇన్సైడ్ టాక్ ఏమిటంటే ఈ చిత్రానికి ఎవెంజర్స్ కనెక్షన్ ఉంది. హాలీవుడ్ యాక్షన్ కో-ఆర్డినేటర్, ఎవెంజర్స్: ఎండ్‌గేమ్’లో భాగమైన క్రిస్ బర్న్స్, మెరైన్ యాక్షన్‌లో నిపుణుడు ఈ ప్రాజెక్ట్‌లో చేరాడు. అతను ‘ది బోర్న్ అల్టిమేటం’, ‘ఐ యామ్ లెజెండ్’, ‘జోకర్’, ‘డాక్టర్ స్ట్రేంజ్’, ‘స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్’, ‘ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్’ వంటి సినిమాలకు పని చేశాడు.
అవేంజర్(Avengers) ఎండ్ గేమ్ తో ఈ మూవీకి కనెక్షన్ ఉందని వార్తలు వస్తున్నాయి. కాగా, ఏక్ థా టైగర్ తో ఈ టైగర్ సీక్వెన్స్ మొదలైంది. మొదటి సినిమా 2012లో విడుదలైంది. తర్వాత సీక్వెన్స్ 2017లో టైగర్ జిందా హై పేరుతో విడుదల చేశారు. ఈ రెండూ పార్ట్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. రూ.100 కోట్లకు పైగా వసూళ్లురాబట్టాయి. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ రా ఏజెంట్ గా కనిపించాడు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకి మరో సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ టైగర్ 3లో సల్మాన్ తో పాటు, ఫారూక్ కూడా నటిస్తుండటం విశేషం.
ఇద్దరు స్టార్ హీరోలు(star heros) ఉన్నారంటే సినిమాకి విపరీతమైన హైప్ వచ్చేస్తుంది. హైప్ తో పాటు సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. అందులోనూ ఇది యాక్షన్ మూవీ కావడంతో బడ్జెట్ ఇంకా పెరిగే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 8వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా, సల్మాన్, షారూక్ మధ్య యాక్షన్ చాలా ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇరు స్టార్ల ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేయగలరట. కేవలం వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ కోసమే నిర్మాత ఏకంగా రూ.35కోట్లు ఖర్చు చేస్తుండటం విశేషం. ఒక్క సెట్ కోసమే నిర్మాత రూ.35కోట్లు పెట్టడానికి ముందుకు రావడం విశేషం.