»We Will Not Pay Electricity Bill Collect From Congress Says Karnataka People
Karnataka People : “సవాలే లేదు… కరెంటు బిల్లు కట్టం.. కాంగ్రెస్ కడుతది”
కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారమే తాము కరెంటు బిల్లులను కట్టడం లేదని తెలిపారు. ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదని చెప్పినా విద్యుత్ అధికారుల మాటను కర్ణాటక ప్రజలు పట్టించుకోవడంలేదు. బిల్లులను కాంగ్రెస్ వద్దే తీసుకోవాలని అంటున్నారు.
కర్ణాటకలో ప్రభుత్వమే ఇంకా ఏర్పడలేదు. అప్పుడే అక్కడి ప్రజలు కరెంటు బిల్లులు కట్టమని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 200 యునిట్ల వరకు కరెంటు బిల్లు వస్తే గనుక దాన్ని ఉచితంగా పరిగనిస్తామని తెలిపింది. అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టాలని ప్రజలను అధికారులు అడిగితే కాంగ్రెస్ ను అడగాలంటున్నారు. ఈ పరిస్థితి కర్ణాటక చిత్రదుర్గ తాలూకాలోని జాలికట్టె గ్రామంలో జరిగింది. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పార్టీ ప్రకటించిందని పేర్కొంటూ విద్యుత్ టారిఫ్ చెల్లించడానికి నిరాకరించారు.
ఒక వైరల్ వీడియోలో, గ్రామస్తులు వారి సంబంధిత మీటర్లలో బకాయి ఉన్న రుసును క్లియర్ చేయమని కరెంటు అధికారులు అడగటంతో… గ్రామస్తులు కట్టమని వాదిస్తున్నారు. ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని,.. అలాంటిది ఇప్పుడు ఎందుకు చార్జీలు కట్టమంటున్నారని తిరిగి ప్రశ్నిస్తున్నారు.
అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ సహా ఐదు హామీలు ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. మే 13న ఫలితాలు వెలువడిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని తెలిపింది. ప్రస్తుతం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసే పనిలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. అప్పుడే కరెంటు చార్జీల పోరు రచ్చకెక్కింది.