తెలంగాణ(telangana)లో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే భూపాలపల్లి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ఇదే జిల్లాలోని కేటీపీపీలోకి కూడా భారీగా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో మిషనరి సహా పలు ప్రాంతాల్లోకి నీరు నిల్వ ఉంది. దీంతో మొదటి దశలో, రెండో దశలో ఉత్పత్తి చేయాల్సిన విద్యుత్(electricity production) కు ఆటంకం(stopped)ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండు దశల్లో కలిపి 1100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడిందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ వరద ప్రవాహం ఇలాగే ఉంటే విద్యుత్ కోతలు తప్పవని హెచ్చరించారు.