»Election Commission Stopped The Release Of Kcrs Film Produced By Comedian Rocking Rakesh
Rocking Rakesh: KCR సినిమాను ఈసీ ఆపేసింది..రాకేష్ భావోద్వేగం
జబర్దస్త్ కమిడియన్ ప్రముఖ నటుడు రాకింగ్ రాకేష్ కేసీఆర్ అనే సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం విడుదలను నిలిపివేస్తూ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై స్పందించిన రాకేష్ భావోద్వేగానికి లోనయ్యాడు. అంతా మన మంచికే అంటూ ఒక పోస్ట్‌ను విడుదల చేశాడు.
Election Commission stopped the release of KCR's film produced by comedian Rocking Rakesh
Rocking Rakesh: జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్(Rocking Rakesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై తనదైన క్లీన్ కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక చిన్నపిల్లలతో స్కిట్స్ చేపిస్తూ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. కేవలం షోలకే పరిమితం కాకుండా సినిమాల్లో కూడా నటిస్తూ వెండితెరపై తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో రాకేష్ ప్రొడ్యూసర్‌గా కేసీఆర్(KCR) అనే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఎలక్షన్ కమిషన్ నుంచి భారీ షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో రాకేష్ ఇన్‌స్టా వేదికగా తన అభిమానులతో విషయాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
తనదైన ఫ్యామిలీ స్కిట్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న రాకేష్ ప్రముఖ యాంకర్ సుజాతను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తరువాత ఇద్దరు కలిసి షోలు చేశారు. ప్రస్తుతం సినిమాను నిర్మాణంలో బిజీగా ఉన్నాడు రాకేష్. కేసీఆర్ సినిమా కోసం తన ఇళ్లును కూడా తాకట్టు పెట్టానని గతంలో చెప్పాడు. ఇక చిత్రం విడుదల అయితే మంచి పేరు వస్తుందని భావించాడు. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికల కమిషన్ కొన్ని సినిమాలకు నిబంధనలు తీసుకొచ్చింది. ఓటర్లను ప్రేరేపించే సినిమాల విడుదలను నిలిపివేసింది. దీనిలో భాగంగా నవంబర్ 17 లేదా 24న విడుదల చేద్దాం అనుకున్న కేసీఆర్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయొద్దు అని ఆర్డర్స్ ఇచ్చింది. ఇదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెబుతూ భావోద్వేగానికి లోనయ్యడు. దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మంచి సినిమాను జనాలు ఎప్పుడైనా ఆధారిస్తారని రాకేష్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.