»Japan Jigar Tandra Both Movies Not Much In Tollywood
Both movies: మంచి ఛాన్స్ మిస్..రెండు బోల్తా కొట్టేశాయి!
నిజమే..ఈసారి దీపావళికి తెలుగు సినిమాలు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాయి. తెలుగు నుంచి మినిమమ్ బజ్ ఉన్న సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. పోనీ డబ్బింగ్ సినిమాలైనా ఓకేనా అంటే..అవి కూడా బోల్తా కొట్టేశాయి.
japan jigar tandra both movies not much in tollywood
దీపావళికి తెలుగు నుంచి ఓ మోస్తారు లేదంటే పెద్ద హీరో సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఆడియెన్స్ పండగ చేసుకునేవారు. కానీ తెలుగు నుంచి మినిమమ్ బజ్ ఉన్న సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ.. అవేంటో పెద్దగా జనాలకు తెలియకుండా పోయింది. కానీ నవంబర్ 10న రిలీజ్ తమిళ్ డబ్బింగ్ సినిమాలు.. కార్తి ‘జపాన్(japan)’, లారెన్స్ ‘జిగర్తాండ డబుల్ ఎక్స్'(jigar tandra x) మంచి బజ్‌తో థియేటర్లోకి వచ్చాయి. తమిళ్‌తో పాటు తెలుగులోను ఈ రెండు సినిమాల మధ్యే పోటీ నడిచింది. ముఖ్యంగా కార్తీ జపాన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ రాజ్ మురుగన్ డైరెక్టర్ చేసిన అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. డే వన్ నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకొని.. క్రమంగా నెగెటివ్ టాక్ మూటకట్టుకుంది.
మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.15 కోట్లకుపైగా గ్రాస్, ఏడున్నర కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టిన జపాన్.. తెలుగులో ఇప్పటివరకు మూడున్నర కోట్ల వరకు గ్రాస్, కోటి డెబ్బై లక్షల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో తెలుగులో ఆరు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదల అయిన జపాన్ బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నారు. ఇక జిగర్ తండ సీక్వెల్‌గా జిగర్ తండ డబుల్ ఎక్స్ తెరకెక్కించాడు కార్తిక్ సుబ్బరాజు. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. లారెన్స్, ఎస్‌జేసూర్య కీ రోల్ ప్లే చేసిన ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ తెలుగు ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచింది. మూడు రోజుల్లో ఈ మూవీకి రెండున్నర కోట్ల వరకు గ్రాస్.. కోటి ఇరవై లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల టాక్. ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ ఈ సినిమాకు తెలుగులో నష్టాలు తప్పవంటున్నారు. దీంతో దీపావళికి తెలుగు సినిమాలు(telugu movies) మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే.