ఢిల్లీ మెట్రో రైలు (Delhi Metro rail) కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. మెట్రో స్టేషన్ లోనే మూత్ర విసర్జన, ఇటీవల ఓ యువతి బ్రా, స్కర్ట్ వేసుకొని, రైలులో ప్రయాణం వంటివి చూపరులకు, వినేవారికి ఇబ్బందిని కలిగించాయి. తాజాగా, ఓ యువజంట ఏకంగా మెట్రో రైలులోనే ముద్దులు పెట్టుకున్న వీడియో వెలుగు చూసింది. ఈ వీడియో ఒక నిమిషం రెండు సెకన్లు ఉన్నది. రైలులో తోటి ప్రయాణీకుల ఎదుటే అబ్బాయి, అమ్మాయి రాడ్డుకు ఒరిగి, కౌగిలించుకుంటూ, ముద్దు పెట్టుకుంటున్న వీడియో ఇది. వరుసగా ఇలాంటి ఘటనలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుండి నేను మెట్రోలోనే ప్రయాణిస్తానని ఓ నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేసాడు. మెట్రో అసాంఘీక సంఘటనలకు అడ్రస్ గా మారిందని, అటెన్షన్ పాట్నా స్టేషన్ నుండి ఢిల్లీ మెట్రోకు మారిందని, ఇప్పుడు మెట్రోలలో యాడ్ ఫ్రీ కంటెంట్ లభిస్తోందని, నగరాల్లో చెట్లు, పుట్టలను తొలగిస్తే ఇలాగే ఉంటుందని, ఇది శిక్షార్హమైన నేరమని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
ఆమె ఉర్ఫీజావెద్ కాదు.. ఢిల్లీ మెట్రోలో ఆమె డ్రెస్సింగ్‌కు ఛీత్కారాలు
అంతకుముందే, మెట్రో రైలులో ఓ మహిళ బ్రాలెట్ టాప్, మినీ స్కర్ట్ వేసుకొని ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియో ఆన్ లైన్ లో తీవ్ర చర్చకు దారి తీసింది. పబ్లిక్ ప్లేస్ లో ఓ మహిళ అలాంటి దుస్తులు ధరించడం ఏమిటని చాలామంది విమర్శించగా, ఆమె వీడియోను అనుమతి లేకుండా తీయడం సరికాదని మరికొంతమంది అంటున్నారు. ఈ సంఘటన ప్రజల గోప్యతను గౌరవించాల్సిన అవసరం, అలాగే వారి ఫ్యాషన్ ఎంపికల పైన చర్చకు తెరలేపింది. ఈ వీడియో తొమ్మిది సెకన్ల పాటు ఉన్నది. ఈ వీడియోలో సదరు యువతి ఇతర అమ్మాయిల మధ్య కూర్చున్నది. ఆమె ఎదుట ఉన్న ఓ వ్యక్తి దీనిని కెమెరాలో బంధించాడు. ఆమె దుస్తులపై చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ మెట్రో గర్ల్ అని చెబుతూ అలాంటి డ్రెస్ వేసుకోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఓ ట్విట్టర్ నెటిజన్ అయితే ఈ వీడియోను చూసి… ఏంటి మెట్రోలో ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతోందా, పబ్లిక్ ప్లేస్ లో ఇలాంటి దుస్తులు వేసుకుంటారా అని వ్యాక్యానించాడు. ఇదేనా మహిళా సాధికారత అని మరో నెటిజన్ పోస్ట్ చేశారు. ఉర్ఫీ జావెద్ బోల్డ్ గా ఫోజులు ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఈమె ఉర్ఫీ జావెద్ కాదని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.