Viral Video: వైన్ షాప్ కావాలని గ్రామస్తులు డిమాండ్
ఎక్కడైనా వైన్ షాపులు కావాలని ఆందోళన చేయడం చుశారా? అవును మీరు విన్నది నిజమే. తెలంగాణలో ఓ ఊరి గ్రామస్థులు తమకు వైన్ షాపు కావాలని ఒక చేరుకుని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు అందరి ఆమోదంతో గ్రామ పంచాయితీ తీర్మానం కూడా చేశారు.
Viral news: దేశంలో చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవడానికి మందు(wine) కారణం అని, అనేక చోట్ల వైన్ షాపులను బ్యాన్ చేయాలని మహిళలు చేసిన నిరసన ఘటనలు చూశాము. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూడా స్త్రీలు ఈ తరహా నిరసనలు చేశారు. దీనికి పూర్తి భిన్నంగా తెలంగాణ ములుగు(Mulugu) జిల్లాలో మాకు మద్యం కావాలని ఓ సరికొత్త వ్యవహారం చోటు చేసుకుంది. మంగపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు కలిసి మాకు వైన్ షాపు కావాలని మందు కోసం ఉద్యమం చేపట్టారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కోర్టు స్టే కారణంగా మంగపేట మండలంలో గత 5 సంవత్సరాలుగా మద్యం షాపులు లేవు. అదే అదునుగా భావించిన కొందరు వ్యాపారస్తులు బ్లాక్లో ఎక్కువ రేట్లకు మద్యం అమ్ముతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెస గ్రామ సభ వేదికగా మల్లూరు, వాగొడ్డుగూడెం ప్రజలు మాకు మద్యం షాపులు కావాలి అంటూ.. చేతులు పెకెత్తి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ ప్రాంతాల్లో గిరిజనులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వారి ఆమోదం కూడా తీసుకొని గ్రామ శాఖ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. దీనికి సంబంధించిన అధికారులతో గ్రామ పంచాయితీ సిబ్బంది, సర్పంచ్లు మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
ములుగు జిల్లా మంగపేట మండలంలో 'మాకు మద్యం షాపులు కావాలి' అంటూ పెస గ్రామ సభ ద్వారా గిరిజన ప్రజలు ఆమోదం తెలిపారు. మల్లూరు, వాగొడ్డుగూడెం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పెస గ్రామ సభలో పాల్గొన్న గిరిజన ఓటర్లు ఆయా గ్రామాల్లో మద్యం షాపులు ఏర్పాటుకు ఆమోదం… pic.twitter.com/xNZYSbmoxr