వక్ఫ్ భూములను తాను కబ్జా (Kabja) చేసినట్లు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) అన్నారు.తనపై వచ్చిన ఆరోపణలను మంత్రి ఖండించారు. హైదరాబాద్(Hyderabad)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలోను తనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ (BRS) నాయకులపై ప్రతిపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయన్నారు. కులం చూసి కాదని, ప్రజలు గుణం చూసి గెలిపించారన్నారు. అధిక మెజార్టీతో గెలిచిన తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.మాయమాటలతో ప్రజల ఓట్లు పొందలేరని మంత్రి అన్నారు