»Ramachandra Yadav Complaint Against Ap Minister Peddireddy Ramachandra Reddy
Peddireddy రూ.35 వేల కోట్లు దోచుకున్నారు, అమిత్ షాకు రామచంద్ర యాదవ్ ఫిర్యాదు
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని.. ఈడీ చేత దర్యాప్తు చేయించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు.
Ramachandra Yadav Complaint Against AP Minister Peddireddy Ramachandra Reddy
Ramachandra Yadav: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ( Peddireddy Ramachandra Reddy) భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉండి రూ.35 వేల కోట్లు దోచుకున్నారని అంటున్నారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు (Amith Shah) ఫిర్యాదు చేశానని వివరించారు. అమిత్ షాతో భేటీ అయిన తర్వాత.. మీడియాతో మాట్లాడారు.
పెద్దిరెడ్డి అవినీతిపై ఈడీ చేత దర్యాప్తు చేయించాలని అమిత్ షాను కోరానని తెలిపారు. అలాగే అవినీతి మంత్రి పెద్దిరెడ్డిని ( Peddireddy) మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఏపీ సీఎం జగన్‌ను రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) డిమాండ్ చేశారు. 2019కి ముందు పెద్దిరెడ్డి ( Peddireddy) కుటుంబానికి ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించకుండా ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపించారు.
ప్రభుత్వం నుంచి అక్రమంగా రూ.వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకొని ప్రజధనాన్ని దోచుకున్నారని రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) అంటున్నారు. పీఎల్ఆర్ కంపెనీపై 160 క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. 17 మంది బినామీ డైరెక్టర్ల ద్వారా 60కి పైగా సూట్ కేసు కంపెనీలను సృష్టించారని వివరించారు. 2019 నుంచి 2023 వరకు కంపెనీ ఆదాయం కొన్ని వందల రెట్లు చూపించారని పేర్కొన్నారు. ఇంత డబ్బు ఎలా సాధ్యమైందని సూటిగా ప్రశ్నించారు.
రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav) చేసిన ఆరోపణలను ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మరీ దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించాల్సి ఉంది.