»Video Viral Passengers Ran From The Double Decker Train
Video Viral: డబుల్ డెక్కర్ రైలు నుంచి పొగలు..పరుగులు తీసిన ప్రయాణికులు
వరుస రైలు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళనను గురిచేస్తున్నాయి. తాజాగా చెన్నై నుంచి బెంగళూరు వెళ్లే డబుల్ డెక్కర్ రైలు ఇంజిన్ లో పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు.
గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా చెన్నై-బెంగళూరు డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్లో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు పరుగులు తీశారు. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలు.. గుడియట్టమ్ రైల్వేస్టేషన్ దాటింది. ఆ తర్వాత చిత్తూరు జిల్లా పరిధిలోకి రాగానే ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. పొగలు రావడం గమనించిన రైల్లోని ప్రయాణికులు వెంటనే చైన్ లాగి రైలును ఆపేశారు. ఆ వెంటనే అన్ని బోగీల్లోని ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.
ఇంజిన్లో పొగలు వస్తున్న వీడియో:
#WATCH | Chennai-Bengaluru Express was halted in Chittoor on Thursday after smoke was witnessed in the engine.
Railway DRM Kusuma Hariprasad stated that the incident happened on Thursday while moving towards Bangalore from Gudiyattam Railway Station. The smoke billowed out of… pic.twitter.com/VL93bvwZGz
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ విషయాన్ని రైల్వే డీఆర్ఎం కుసుమ హరిప్రసాద్ వెల్లడించారు. ఇంజిన్లో బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే దట్టమైన పొగలు అలముకున్నాయని, రైలు మలుపు తిరుగుతుండగా ఎస్-6 బోగీలోని ప్రయాణికులు గమనించి వెంటనే చైన్ లాగారని తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించారు. దీంతో ఆ రైలు బెంగళూరుకు బయల్దేరి వెళ్లింది.