»Video Of Man Who Saved A Visually Impaired Womans Child From Railway Track Goes Viral Again
Viral Video: ప్రాణాలకు తెగించి, రైల్ ట్రాక్ పైన చిన్నారిని కాపాడిన వర్కర్
సినిమాల్లో మనం ఎన్నో స్టంట్స్ చూస్తుంటాం... నిజ జీవితంలోను అప్పుడప్పుడు అలాంటి హీరోయిజం (heroism) కనిపిస్తుంది. దైర్యంగా కొన్ని పనులు చేసే వారిని ప్రశంసించకుండా ఉండలేం. థానేలోని ఓ రైల్వే స్టేషన్ లో (railway station in Thane) పాయింట్ మెన్ గా (rail worker) పని చేస్తున్న మయూర్ షెల్కే ఓ చిన్నారి ప్రాణాలు కాపాడాడు.
సినిమాల్లో మనం ఎన్నో స్టంట్స్ చూస్తుంటాం… నిజ జీవితంలోను అప్పుడప్పుడు అలాంటి హీరోయిజం (heroism) కనిపిస్తుంది. దైర్యంగా కొన్ని పనులు చేసే వారిని ప్రశంసించకుండా ఉండలేం. థానేలోని ఓ రైల్వే స్టేషన్ లో (railway station in Thane) పాయింట్ మెన్ గా (rail worker) పని చేస్తున్న మయూర్ షెల్కే ఓ చిన్నారి ప్రాణాలు కాపాడాడు. ప్రమాదవశాత్తూ రైలు పట్టాలపై పడిపోయిన చిన్నారి ప్రాణాలను కాపాడినందుకు అతనిని రైల్వే మంత్రిత్వ శాఖ (Railway Ministry) సత్కరించింది. ఈ సంఘటన 2021లో జరిగింది. అయితే ఈ వీడియోను భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ (former India cricketer VVS Laxman) ట్వీట్ చేయడంతో వైరల్ గా మారింది. ఆరేళ్ల చిన్నారిని కాపేడేందుకు తన ప్రాణాలను పణంగా పెట్టేలా ధైర్యం చేసిన షెల్కే ధైర్యవంతుడని లక్ష్మణ్ ప్రశంసించారు.
థానేలోని సెంట్రల్ రైల్వేకు చెందిన వంగని స్టేషన్ రైలు పట్టాలపై చిన్న పిల్లవాడు పడిపోయాడు. అతను తన తల్లితో కలిసి ప్లాట్ ఫామ్ పైన నడుస్తున్నాడు. ఆ తల్లికి దృష్టి లోపం ఉంది. అదే సమయంలో ఆ బాలుడు పట్టాల పైన పడిపోయాడు. ఆ పరిస్థితుల్లో ఆ తల్లి నిస్సహాయక స్థితిలో ఉన్నది. దీనిని చూసిన రైల్వే వర్కర్ మయూర్ పెల్కే ధైర్యం చేసుకొని, తను ఉన్న చోటు నుండి బాలుడి వద్దకు పరుగు పెట్టాడు. రైలు దగ్గరకు వస్తోంది.. పెల్కే పట్టాలపై ఉన్న బాలుడిని క్షణాల్లో ప్లాట్ ఫామ్ పైకి ఎక్కిస్తాడు. ఆ వెంటనే రైలు తన వైపుగా వస్తుండటంతో… కళ్లు మూసి తెరిచేంత సమయంలో తాను కూడా ప్లాట్ ఫామ్ పైకి చేరుకుంటాడు. ఆ వెంటనే రైలు అక్కడి నుండి వెళ్తుంది. క్షణం ఆలస్యమైనా షెల్కే ప్రాణాలు పోయేవి. కానీ అతను ధైర్యంగా ఆ బాలుడిని ఆ తల్లికి అప్పగించాడు. మయూల్ షెల్కేను చూసి గర్వపడుతున్నానని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు.
ఆ తల్లి, కొడుకులు పేదరికం నుండి వచ్చారని తనకు అర్థమైందని, బాలుడికి చదువుకునే స్థోమత కూడా లేదని, అందుకే తనకు అవార్డుగా వచ్చిన డబ్బుల్లో సగం మొత్తాన్ని అతని ఉజ్వల భవిష్యత్తు కోసం ఇస్తున్నానని షెల్కే మరో సాయం కూడా చేశాడు. వీవీఎస్ ట్వీట్ నేపథ్యంలో నెటిజన్లు మరోసారి రియల్ హీరో అంటూ షెల్కేను ప్రశంసిస్తున్నారు.
Bow down in gratitude to Mayur Shelke who saved the life of a 6 year old child of a visually impaired mother,risking his own life . The railways announced a cash prize for Mayur,and he donated half of it for the child’s education. Proud of Mayur’s values🙏🏼pic.twitter.com/Mc9ct5Z63a