»Tspsc Group 2 Exam Dates On 2023 August 29 And 30 Group 4 Candidates Are Afraid
TSPSC: గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్…కానీ గ్రూప్ 4 అభ్యర్థుల ఆవేదన!
తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మరోవైపు గ్రూప్ 4 ఉద్యోగాల్లో అనేక జిల్లాలలో తమకు పోస్టులను కేటాయించడంలో అన్యాయం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్స్ డేట్స్ ఫిక్సయ్యాయి. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) వెల్లడించింది. పరీక్షకు వారం రోజుల ముందుగా హాల్ టిక్కెట్లు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. గ్రూప్ 2 నోటిఫికేషన్లో(group 2 notification) మొత్తం 783 పోస్టులు ఉండగా..అందుకోసం 5,51,943 మంది ఉద్యోగార్థులు అప్లై చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు సుమారుగా 705 మంది పోటీ పడుతున్నారు.
మరోవైపు ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 పరీక్షల తేదీలను TSPSC ఖరారు చేసింది. జూన్ 5వ తేదీ నుంచి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరుగనుండగా, 8 వేలకుపైగా ఉన్న పోస్టులకు గాను జూలై 1 నుంచి గ్రూప్ 4 పరీక్షలు(group 4 exam dates) మొదలుకానున్నాయి.
ఇంకోవైపు గ్రూప్ 4 ఉద్యోగాల్లో(group 4 jobs) అనేక జిల్లాలలో తమకు పోస్టులను కేటాయించడంలో అన్యాయం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. రోస్టర్ పాయింట్ల(roster points) ప్రతిపాదికన పోస్టులను విభజించడం వల్ల అనేక విభాగాల్లో తమకు అసలు పోస్టులే లేవని అంటున్నారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని చెబుతున్నారు. మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు కేటాయించారని ఉద్యోగార్థులు వాపోతున్నారు. ఈ రోస్టర్ పాయింట్ల పద్ధతిలో పోస్టులు కేటాయించడం వల్ల కొన్ని జిల్లాలకు 20 ఉద్యోగాలు కూడా రాలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.