TRS ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన రూ.80.66 కోట్లను జప్తు చేసింది. జూబ్లీహిల్స్ లోని మధుకాన్ గ్రూప్ ప్రధాన కార్యాలయం సహా హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాలోని 28 ప్రాంతాల్లోని 28 స్థిరాస్తులను ఈడి అటాచ్ చేసింది.
రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరుతో నామా నాగేశ్వర్ రావు రుణాలు తీసుకుని మళ్లీంచారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు రూ.361.92 కోట్లు నేరుగా మళ్లీంచినట్లు గుర్తించామని ఈడీ స్పష్టం వెల్లడించింది. డొల్ల కంపెనీల ద్వారా ఈ నిధుల మళ్లింపు జరిగిందని ED తెలపింది. మరోవైపు గతంలో ఈ కేసులో ఎంపీ నామాకు చెందిన రూ.67.08 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.