ఇండియాలో ఈసారి అత్యధిక వర్షపాతం కలిగించే నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రానున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఆలస్యంగా రానున్నట్లు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. జూన్ 1వ తేదికి నైరుతి రుతుపవనాలు భారత్ లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ వర్షపాతాన్ని మాత్రమే అందించనున్నట్లు భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. భారత్ లోకి ప్రవేశించిన రుతుపవనాలు మిగిలిన భాగాలకు ఎప్పుడు వ్యాపిస్తాయనే దానిపై వివరాలను త్వరలోనే తెలుపనుంది. గత ఏడాది అత్యధిక వర్షపాతం నమోదైంది.
సాధారణంగా నైరుతి రుతుపవనాలు త్వరగానే భారత్ లోకి ప్రవేశిస్తాయి. జూన్ 1వ తేదికి రుతుపవనాలు ఇండియాలోని కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈసారి ఆలస్యంగా నాలుగు రోజుల తర్వాత కేరళను తాకనున్నాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలు ఆలస్యంగా విస్తరిస్తే ఆ ఏడాది అంతా వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, రుతుపవనాలు త్వరగా విస్తరిస్తే దేశం మొత్తం సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది భారత్ లో నైరుతి సీజన్ లో 96 శాతం వర్షపాతం నమోదైనట్లు వాతావరణ సంస్థ వెల్లడించింది.