టర్కీ, సిరియా దేశాల్లో వరుస భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం ఉదయం నుంచి వరుసగా భూకంపాలు సంభవించడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేటి ఉదయం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే మధ్యాహ్నం 7.5 తీవ్రతతో రెండోసారి భూకంపం సంభవించగా తాజాగా మూడోసారి 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప కేంద్రం సెంట్రల్ టర్కీలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 12 గంటల వ్యవధిలోనే మూడుసార్లు భారీ భూకంపాలు సంభవించడంతో ఇప్పటి వరకూ 1600 మందికి పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.
A little girl who was pulled out from under the concrete in the earthquake. Urfa Turkey pic.twitter.com/XZx4RZ2upO
BREAKING: At least 1,600 dead in a massive 7.8 Earthquake in Turkey and Syria this morning. Please pray for these people. I’ll post some ways to help in this thread below as I find them. Please do the same. pic.twitter.com/cmlExLi2M6
ఇంకా శిథిలాల కింద చాలా మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య 5 వేలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరుస భూకంపాలు సంభవించడంతో టర్కీ, సిరియా దేశాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం రెండు దేశాల్లోనూ భారీ ఎత్తున సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని అధికారులు, స్థానికులు వెలికితీసేందుకు శ్రమిస్తున్నారు.