ప్రముఖ సినీ నిర్మాత బెల్లం కొండ సురేష్(Bellamkonda Suresh) కారులో దొంగతనం జరిగింది. జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టు కాలనీలో గల తన సాయి గణేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ ముందు బెల్లంకొండ బెంజి కారు ను గురువారం పార్క్ చేసి వెళ్లారు. అయితే శుక్రవారం ఉదయం చూసేసరికి కారులో వెనకవైపు అద్దం పగిలిపోయి ఉండటం గమనించారు. చెక్ చేస్తే.. అందులోని రూ. 50 వేల నగదుతో పాటు 11 కాస్ట్లీ మందు బాటిళ్లు మాయమైనట్లు బెల్లంకొండ సతీమణి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి దర్యాప్తు మొదలుపెట్టారు.
కాగా బెల్లం కొండ శ్రీనివాస్(Bellamkonda srinivas) విషయానికి వస్తే.. బాలకృష్ణతో ‘చెన్నకేశవ రెడ్డి’, ‘లక్ష్మీ నరసింహ’ వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. అలాగే ఎన్టీఆర్‌తో ‘రభస’, రామ్‌తో ‘కందిరీగ’ , రవితేజ తో నా ఆటోగ్రాఫ్ మూవీస్ నిర్మించారు. కాగా, ప్రస్తుతం ఆయన కొడుకులు బెల్లకొండ శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్ హీరోలుగా రాణిస్తున్నారు. శ్రీనివాస్ ఇటీవలే ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ మూవీ ప్లాప్ అయ్యింది. ఇక ‘స్వాతిముత్యం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన గణేష్.. రీసెంట్గా ‘నేను స్టూడెంట్ సర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.