»The Price Of This Goat Is Rs 12 Lakhs Weight Is 176 Kg At Madhya Pradesh
Viral news: ఈ మేక ధర రూ.12 లక్షలు..ఎందుకో తెలుసా?
మాములుగా అయితే ఒక మేక ఖరీదు ఎంత ఉంటుంది. దాదాపు 15 వేల రూపాయల నుంచి 20, 30, 40 వేల వరకు ఉంటుంది. ఇంకా మంచి మాంసం కలిగిన మేక అయితే ఇంకా ఎక్కువలో ఎక్కువ లక్ష రూపాయల వరకు ఉండవచ్చు. కానీ ఈ మేక రేటు తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. అవును అక్షరాలా 12 లక్షల రూపాయలు. ఇది ఎక్కడనో ఇప్పుడు చుద్దాం.
ఈ మేక ధర తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు. అంతేకాదు దీని బరువు కూడా తక్కువగా ఉంది. మరి అంతరేటు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 43 అంగుళాలు ఉన్న మేక బరువు 176 కిలోలు. ఈ మేకను అమ్మకానికి పెట్టి ఇటీవల రూ.12 లక్షలకు విక్రయించారు. అయితే ఈ మేకకు ఇంత రేటు ఎందుకని అక్కడున్నవారు ఆశ్చర్యపోతున్నారు.
సుహైల్ అహ్మద్ అనే వ్యక్తికి మేకల పెంపకం అంటే చాలా ఇష్టం. 8 నెలల కిందటే రాజస్థాన్లో ఈ మేకను కొనుగోలు చేశాడు. చాలా మంచిగా పెంచాడు. బక్రీద్ సందర్భంగా మేకను విక్రయానికి ఉంచగా భారీ ధర పలికింది. అతను పెంచే మేకకు ‘రాజు’ అని ముద్దుగా పేరు పెట్టారు. ఈ కోటా జాతికి చెందిన మేక బరువు 176 కిలోలు. ముంబైకి చెందిన ఓ వ్యక్తి దీనిని రూ.12 లక్షలకు ‘కింగ్’ను కొనుగోలు చేశాడు. ఎండాకాలం నుంచి మేకను రక్షించడానికి అతను రెండు కూలర్లను కూడా అమర్చాడు. ఎప్పటికప్పుడు వెటర్నరీ డాక్టర్తో వైద్య పరీక్షలు చేయించేవాడు. ఒక షెడ్డు వేసి రాజుగారిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. 8 నెలల క్రితం రాజస్థాన్లో ‘కింగ్’ను కొన్నానని ఆయన వెల్లడించాడు. అంతేకాదు అతను దానికి చిక్పీస్, గోధుమలు, పాలు, ఖర్జూరం వంటి మంచి పోషక ఆహారాన్ని ఇచ్చానని సుహైల్ అహ్మద్ పేర్కొన్నాడు.