»Telangana Cm Kcrs Soulful Message To Brs Party Activists
KCR: బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు.. కేసీఆర్ ఆత్మీయ సందేశం
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) పార్టీ కార్యకర్తలకు ఆత్మీయ సందేశం విడుదల చేశారు. ఈ ఏడాది ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ కోరారు. మరోవైపు బీజేపీ(BJP) చేస్తున్న తప్పుడు వార్తలను తిప్పి కొట్టాలని కార్యకర్తలకు చెప్పారు.
అన్నం తిని తినకుండా సాధించుకున్న తెలంగాణలో గులాబీ జెండా ఎగురవేసిన కీర్తి పార్టీ సైనికులకే దక్కుతుందని సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. 60 లక్షల సభ్యత్వంతో పార్టీ అజేయమైన శక్తిగా ఎదిగిందని తెలిపారు. ఈ క్రమంలో బీఆర్ఎస్(BRS) పార్టీ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ సీట్ల వరకు ఎదిగినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రం కూడా అన్ని రంగాల్లో అభివృద్ది చెందినట్లు కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణతోపాటు దేశం కూడా బాగుండాలని అన్నారు.
ఈ క్రమంలో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశంకోసం బీఆర్ఎస్(BRS) పార్టీ కృషి చేస్తున్నట్లు కేసీఆర్(KCR) తెలిపారు. ఈ నేపథ్యంలో భారసాపై బీజేపీ(BJP) దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణలో అభివృద్ధిని బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అనేక కుట్రలను చేధించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం బయపడేదని లేదన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉండాలని కేసీఆర్ కోరారు. ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలని తిప్పి కొట్టాలని తెలిపారు. ఈ తరుణంలో దేశం కోసం జరిగే పోరాటాలలో ధర్మమే గెలుస్తుందని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆత్మీయ సందేశం. pic.twitter.com/tTApFdoznB