ఆస్ట్రేలియా లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ కోసం తలపడనుంది. కాగా…. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా నూతన జెర్సీలో దర్శనమివ్వనుంది. తాజాగా… ఈ న్యూ జెర్సీ ని బీసీసీఐ నేడు ఆవిష్కరించడం గమనార్హం. ఈ జెర్సీతో సహా ఆటగాళ్ల కోసం ఎంపీఎల్ స్పోర్ట్ సంస్థ రూపొందించిన కిట్ ను ప్రదర్శించింది. ఈ అధికారిక జెర్సీ విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది.
ఈ కొత్త జెర్సీ లేత నీలం రంగులో ఉంది. కొంతవరకు ఇటీవల ఆసియా కప్ లో భారత ఆటగాళ్లు ధరించిన జెర్సీలకు దగ్గరగా ఉంది. ఇది టీ20 జెర్సీ అని బీసీసీఐ వెల్లడించింది. భారత మహిళల జట్టుకు కూడా ఇదే అధికారిక జెర్సీ అని తెలుస్తోంది.
‘వన్ బ్లూ జెర్సీ’ పేరిట బీసీసీఐ పంచుకున్న ఫొటోలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలతో పాటు మహిళా జట్టు సారథి హర్మన్ ప్రీత్, షెఫాలీ తదితరులు కూడా ఉన్నారు. కాగా, టీ20 వరల్డ్ కప్ అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియాలో జరగనుంది. కొత్త జెర్సీలో షేడింగ్ అవుతూ త్రిభుజాకారంలో కనిపిస్తున్నవి ట్రయాంగిల్స్.. ఇవి టీమిండియా ఫ్యాన్స్ శక్తి (ఎనర్జీ), స్ఫూర్తి (స్పిరిట్), సామర్థ్యం (పవర్) లను సూచిస్తాయి.
ఇక జెర్సీ ఎడమవైపుగా షేడింగ్ లేకుండా బ్లూ కలర్ లో.. పూరేకుల ఆకారంలో ఉన్నవి పెటల్స్. వీటిని బీసీసీఐ లోగో నుంచి తీసుకున్నారు. ఇది మెరిట్, లొయాలిటీని సూచిస్తున్నది. అన్నింటికంటే ముఖ్యమైనది బీసీసీఐ లోగో మీద ఉన్న మూడు స్టార్లు.. లోగో మీద ఉన్న ఈ స్టార్లు దేనికి సంకేతమని క్రికెట్ వర్గాల్లో ఒకటే చర్చ జరుగుతున్నది. తాజాగా ఎంపీఎల్ ఆ చర్చలకు సమాధానం చెప్పింది. లోగో మీద ఉన్న మూడు నక్షత్రాలు.. భారత్ గెలిచిన మూడు ప్రపంచకప్పులు కావడం గమనార్హం.