»Tdp Leader Complaint To President Murmu Over Ap Speaker Thammineni Education Qualification
Thammineni Education: నకిలీ డిగ్రీతో ఏపీ స్పీకర్ లా అడ్మిషన్: రాష్ట్రపతికి టీడీపీ నేత ఫిర్యాదు
ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పైన తెలుగు దేశం పార్టీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్నారని, కానీ డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందినట్లు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కూన రవి కుమార్ ఫిర్యాదు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్ (andhra pradesh assembly speaker) తమ్మినేని సీతారామ్ (thammineni seetharam) పైన తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) రాష్ట్రపతికి (President of India) ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. గౌరవప్రదమైన స్పీకర్ (Speaker) పదవిలో ఉన్నారని, కానీ డిగ్రీ తప్పుడు సర్టిఫికెట్ (Fake Degree certificate) సమర్పించి మూడు సంవత్సరాల న్యాయ విద్యలో అడ్మిషన్ పొందినట్లు శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కూన రవి కుమార్ (Srikakulam district TDP president Kuna Ravikumar) ఫిర్యాదు చేశారు. తమ్మినేని (thammineni seetharam) నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో మూడేళ్ల లా కోర్సులో అడ్మిషన్ తీసుకున్నారని ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు (President of India Droupadi Murmu) విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతితో పాటు తెలుగు రాష్ట్రాల గవర్నర్లు (Telugu States Governors), సుప్రీం కోర్టు (Supreme Court), హైకోర్టు సీజేలకు (Hihg Court), ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు (Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy) ఆయన లేఖలు రాశారు.
తమ్మినేని శాసన సభాపతిగా ఎన్నికైన అనంతరం హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో (Hyderabad) ఉన్న మహాత్మాగాంధీ లా కాలేజీలో (mahatma gandhi law college) 2019-20 అకడమిక్ ఇయర్ లో మూడేళ్ల లా కోర్సులో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తో (Fake Degree Certificate) అడ్మిషన్ తీసుకున్నారని ఆరోపించారు. అది ఉస్మానియా యూనివర్సిటీకి (Osmania University) అనుబంధ కాలేజీ అని, నిబంధనల ప్రకారం మూడేళ్ల లా కోర్సులో చేరాలంటే డిగ్రీ లేదా తత్సమాన కోర్సును పూర్తి చేసి ఉండాలన్నారు. తమ్మినేని గ్రాడ్యుయేషన్ పూర్తి చేయ లేదని, ఆ విషయాన్ని గతంలోను ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారని గుర్తు చేశారు. గత సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లోను ఆయన ఈ విషయాన్ని పొందుపర్చారని తెలిపారు. తాను ఇంటర్ చదివానని, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతూ మధ్యలో చదువు మానేసినట్లు చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
డిగ్రీ కోర్సు పూర్తి కాకుండానే మూడేళ్ల లాకోర్సు చేయడానికి తమ్మినేని వంటి ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు యూనివర్సిటీ అధికారులు ఏమైనా ప్రత్యేక అనుమతి ఇచ్చారా.. 2019-20లో ఆయన లా పరీక్షలకు కూడా హాజరయ్యారని, అప్పుడే వార్తా పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. వార్తా క్లిప్పింగ్స్ ను, తమ్మినేని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిడ్ ను ఆయన తన లేఖలతో పాటు జత చేశారు. తమ్మినేను ఏపీ అసెంబ్లీ స్పీకర్ అని, ఎమ్మెల్యేలకు మార్గదర్శకులు అని గుర్తు చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్ తీసుకోవడం వంటి తప్పుడు పనులు చేయడం సరికాదన్నారు. ఆయన చేసిన పని చట్టవిరుద్ధమని, శిక్షార్హమని పేర్కొన్నారు.