Somesh Kumar:తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు (Somesh Kumar) కీలక పదవీ వరించింది. సీఎం కేసీఆర్ (cm kcr) సలహాదారునిగా ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవీలో మూడేళ్లపాటు కొనసాగుతారు. క్యాబినెట్ హోదా కల్పిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది. సోమేష్ కుమార్‌ను (Somesh Kumar) ఏపీకి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దానిని హైకోర్టు సమర్థించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో జాయిన్ అయ్యారు.. కొద్ది రోజులకే వీఆర్ఎస్ (VRS) కూడా తీసుకున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ (KCR) ముఖ్య సలహాదారుగా నియమితులు అయ్యారు.
సీఎస్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో సోమేశ్ కుమార్ (Somesh Kumar) ముద్ర ఉంది. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా మెలిగారు. అందుకోసమే సలహాదారునిగా కీలక పదవీ వరించింది. ఏపీకి కేటాయించిన సమయంలోనే.. ఆయన వెళ్లరని ప్రచారం జరిగింది. అయినప్పటికీ అక్కడికి వెళ్లి… ఆ వెంటనే వీఆర్ఎస్ (VRS) తీసుకున్నారు. సర్వీసుకు సంబంధించి లైన్ క్లియర్ అవడంతో.. తాజాగా ప్రభుత్వం సలహాదారునిగా నియమించింది.