నేడు ఉప్పల్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ శుభ్ మన్ గిల్ సెంచరీ చేశాడు. మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ నెగ్గిన టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. అయితే డ్రింక్స్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లను కోల్పోయింది. భారత్ బ్యాటర్లు రోహిత్ శర్మ 34, విరాట్ కోహ్లీ 8 పరుగులు చేసి ఔట్ అయ్యారు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత కూడా వరుసగా ఇషాన్ కిషన్ 5, సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు చేసి ఔట్ అయ్యారు. అయితే వరుస షాట్లతో శుభ్ మన్ గిల్ చెలరేగాడు. సెంచరీ చేసి టీమిండియా స్కోర్ ను పెంచాడు. శుభ్ మన్ గిల్ కు జతగా క్రీజ్ లో హార్థిక్ పాండ్యా కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 33 ఓవర్లకు భారత్ స్కోర్ 203/4గా ఉంది.