వివేకా హత్య కేసు(Viveka Murder Case)కు సంబంధించి సీబీఐ(CBI) అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటి వరకూ ఈ కేసుకు సంబంధించి వైఎస్ షర్మిల(YS Sharmila), వైఎస్ జగన్ (Ys Jagan)లు స్పందించలేదు. అయితే ఎట్టకేలకు తొలిసారి వైఎస్ షర్మిల(YS Sharmila) స్పందించింది. తన చిన్నాన్న వివేకా పేరుపై ఆస్తులేవీ లేవని, ఆస్తులన్నీ కూడా సునీత పేరుపై రాశారని వైఎస్ షర్మిల తెలిపారు. ఆస్తి కోసమే అయితే వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి హత్య చేయాల్సింది సునీతను అని, కానీ అలా చేయలేదన్నారు.
తన చిన్నాన్న తనపేరుపై ఉన్న అరకొర ఆస్తులన్నీ సునీత పిల్లలకే రాశారని వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. వైఎస్ వివేకానంద రెడ్డి ప్రజానాయకుడని, జనం మనిషి అని కీర్తించారు. సునీతకు వివేకాను హత్య(Viveka Murder) చేయాల్సిన మోటీవ్ లేదని అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి వ్యక్తిత్వంపై ఇప్పుడు దాడి చేయడం సరికాదని, తన చిన్నాన్న పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు.