విశాఖ ఆర్కే బీచ్(Visakha RK Beach) వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ అర్ధనగ్నంగా అనుమానాస్పద మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతదేహం(Deadbody) తీరు చూస్తుంటే ఆమె మరణంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆర్కే బీచ్ వద్ద మృతదేహం ఇసుకలో కూరుకుపోయి కనిపించింది. కేవలం ఆ యువతి ముఖం మాత్రమే బయటకు కనిపించి ఉంది. ఆ యువతిది హత్య(Murder)? లేక ఆత్మహత్య(Suicide) అనేది తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
మృతిచెందిన మహిళ గాజువాక నడుపూరికి చెందిన స్వాతి(Swathi)గా పోలీసులు గుర్తించారు. మంగళవారం సాయంత్రం స్వాతి ఇంటి నుంచి బయటకు వచ్చింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు కంగారు పడ్డారు. పోలీసులు మిస్సింగ్ కేసు(Missing Case) నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా స్వాతి ఆర్కే బీచ్(Visakha RK Beach) వద్ద శవమై కనిపించింది. డెడ్ బాడీ ఉన్న తీరును బట్టి పోలీసులు ఆమెది హత్యేనని అనుమానిస్తున్నారు.
స్వాతిని ఎవరో కావాలనే చంపేసి వారి ఆనవాళ్లు దొరక్కుండా ఇసుకలో పాతిపెట్టినట్లు కనిపిస్తోంది. బీచ్(Visakha RK Beach) వద్ద మహిళ చనిపోయి ఉండటాన్ని చూసిన స్థానికులు ఉలిక్కి పడ్డారు. స్వాతికి పెళ్లై ఏడాది అవుతోంది. ఆమె ఇప్పుడు ఐదు నెలల గర్భిణి. స్వాతి ఇంటి నుంచి వెళ్లకుముందు తన భర్తతో పోట్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. స్వాతి మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.