ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా పేరు తెచ్చుకుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. దాంతో అమ్మడు గాల్లో తేలిపోయింది.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో కండీషన్స్ అప్లై అనేలా వ్యవహరించింది. అలాగే కోబ్రాతో మరిన్ని భారీ ఆఫర్లు వస్తాయనుకుంది. కానీ అమ్మడికి కోబ్రా బిగ్ షాక్ ఇచ్చినంత పనైంది. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన కోబ్రా మూవీ.. భారీ అంచనాల మధ్య ఆగష్టు31న థియేటర్లోకి వచ్చింది. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విక్రమ్.. ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇక ఇందులో హీరోయిన్గా నటించిన కెజీయఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. అంతకు మించి అనేలా ఆశలు పెట్టుకుంది. కానీ కోబ్రా మాత్రం అంచనాలను అందుకోలేకపోయిందని అంటున్నారు. దాంతో ఈ మూవీ విక్రమ్‌ను నిరాశ పరిచిందనే చెప్పొచ్చు. ఇక శ్రీనిధి శెట్టికి మాత్రం కోబ్రా షాక్ ఇచ్చిందనే చెప్పాలి.
కెజీయఫ్ టైంలోనే ఈ సినిమాకు కమిట్ అయింది ఈ బ్యూటీ. అయితే కెజీయఫ్ చాప్టర్ 2 సంచనలంగా నిలవడంతో అమ్మడి రేంజ్ పెరిగిపోయింది. అందుకే వచ్చిన ప్రతి ఆఫర్‌ను హోల్డ్‌లో పెట్టడమో లేక.. రిజెక్ట్ చేయడమో చేసింది. అది కూడా మీడియం రేంజ్ హీరోలతో చేయనని చెప్పిందట. దాంతో ఏ ఒక్క సినిమాకు కూడా కమిట్ అవలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే కోబ్రా హిట్ అయితే బడా ఆఫర్లొస్తాయని భావించింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. వచ్చిన ఆఫర్లలో ఏదో ఒక సినిమా కమిట్ అయి ఉంటే.. కనీసం చేతిలో ఓ ప్రాజెక్ట్ అయినా ఉండేది. కానీ ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చిందని అంటున్నారు. కోబ్రాలో శ్రీనిధి క్యారెక్టర్‌కు పెద్దగా స్కోప్ లేకపోవడంతో.. అమ్మడి సినీ కెరీర్ డైలమాలో పడ్డట్టేనని కామెంట్ చేస్తున్నారు. మరిప్పుడు శ్రీనిధి పరిస్థితేంటో తనకే తెలియాలి.