»Samantha Shocking Post On Shaakuntalam Movie Flop Talk
Samantha: శాకుంతలం నా కర్మ.. సమంత షాకింగ్ పోస్ట్!
సమంత(Samantha) రూత్ ప్రభు కెరీర్ అన్ని ఎత్తుపల్లాలను చవిచూసింది. ఇటీవల విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో విఫలమైంది. ఈ చిత్రం రెండంకెల సంఖ్యను చేరుకోవడానికి చాలా కష్టపడింది. నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల కంటే తక్కువ రాబట్టింది. ఈ క్రమంలో ఆమె తన ఇన్ స్టా ఖాతాలో కీలక పోస్ట్ చేసింది.
ఏదైనా రిజల్ట్ తేడా కొట్టినప్పుడు కర్మ సిద్దాంతాన్ని వాడుతుంటారు. ఇప్పుడు స్టార్ బ్యూటీ సమంత(Samantha).. డైరెక్ట్‌గా శాకుంతలం చేసినందుకు అంతా నా కర్మ అనేలా.. ఇండైరెక్ట్‌గా కర్మ సిద్దాంతాన్ని పోస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. చాలా రోజులుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నశాకుంతలం మూవీ.. ఏప్రిల్ 14న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్, నిర్మాత దిల్ రాజుతో కలిసి గట్టిగానే ప్రమోట్ చేశాడు. సమంత కూడా ప్రమోషన్స్ చేసింది.. ఫీవర్ వచ్చిందనే పబ్లిసిటీ స్టంట్ కూడా అప్లై చేసింది. కానీ తీరా థియేటర్లోకి వచ్చాక.. శాకుంతలం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
అసలు ఈ సినిమా ఓపెనింగ్స్.. ట్రేడ్ వర్గాలకు సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. జస్ట్ నెగెటివ్ టాక్‌తోనే ఈ సినిమా సరిపెట్టుకోలేదు.. గ్రాఫిక్స్ పట్ల దారుణమైన విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా సమంత చూడ్డానికి అస్సలు బాగాలేదనే కామెంట్స్ వినించాయి. మొత్తంగా శాకుంతలం సినిమా సమంతకు బిగ్ షాక్ ఇచ్చింది. అందుకే కాబోలు.. అమ్మడు సోషల్ మీడియాలో కర్మ సిద్దాంతాన్ని పోస్ట్ చేసింది.
ఇన్‌స్టా గ్రామ్ వేదికగా కారులో కూర్చున్న ఓ ఫోటోని షేర్ చేసింది. ఈ సందర్భంగా.. Karmanye vadhika raste.. Ma phaleshu kadachana.. Ma karma phala he tur bhuh.. Ma te sangotsva karmani అనే శ్లోకం రాసుకొచ్చింది. దీంతో ఇండైరెక్ట్‌గా సమంత.. శాకుంతలం రిజల్ట్ గురించే ఇలా చెప్పిందని అంటున్నారు. ఈ శ్లోకానికి అర్థం.. ప్రయత్నం చేయడం వరకే మన చేతిలో ఉంటుంది.. దాని ఫలితం ఏమిటనేది మనం నిర్ణయంచలేమని చెబుతుంది. దీంతో శాకుంతలం రిజల్ట్ వల్లే అమ్మడు ఇలా పోస్ట్ చేసిందని చెప్పొచ్చు.