Sakshi Agarwal: ఐటీ కంపెనీ నుండి హీరోయిన్ గా… ‘హేయ్.. నేను నిన్ను చూస్తున్నాను’
తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన నటి సాక్షి అగర్వాల్ (Sakshi Agarwal) సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో తన ఫోటోలను పొందుపరిచింది. 2013లో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2021 నుండి సినిమాల్లో కాస్త బిజీ అయ్యారు.
తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించిన నటి సాక్షి అగర్వాల్ (Sakshi Agarwal) సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో తన ఫోటోలను పొందుపరిచింది. 2013లో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2021 నుండి సినిమాల్లో కాస్త బిజీ అయ్యారు.
ఆమె మార్కెటింగ్ కన్సల్టెంట్ ద్వారా తన వర్కింగ్ కెరీర్ ను ప్రారంభించారు. యాక్టింగ్ కోర్సులో చేరారు. మోడలింగ్ చేశారు. ఆ తర్వాత వివిధ దక్షిణాది చిత్రాల్లో వివిధ రోల్స్ ను పోషించారు. ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ నటిగా పేరు తెచ్చుకున్నారు.
సాక్షి అగర్వాల్ ది నైనిటాల్. చెన్నైలోని గుడ్ షెపర్డ్ పాఠశాలలో చదివారు. సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో జాయిన్ అయి మార్కెటింగ్ కన్సల్టెంట్ గా వర్కింగ్ కెరీర్ ను ప్రారంభించారు. 2010లో ఇన్ఫోసిస్ లో చేరారు. ఆ తర్వాత మోడలింగ్ వైపుకు వచ్చారు. ఆమె మోడలింగ్ రిక్రూటర్ ను కలవగా, అడ్వైర్టైజ్ మెంట్ డైరెక్టర్లను పరిచయం చేశారు.
తన వీకెండ్స్ ను కమర్షియల్ అసైన్ మెంట్ కోసం కేటాయించేవారు సాక్షి. ప్రింట్, టెలివిజన్, ఫ్యాషన్ షోలలో కనిపించారు. సూర్యతో పాటు మలబార్ గోల్డ్ ప్రకటనలోను దర్శనమిచ్చారు. ఈ రంగం తనకు నచ్చడంతో 2013 జనవరిలో ఇన్ఫోసిస్ ఉద్యోగాన్ని వదిలేశారు. ఆ తర్వాత నటిగా కెరీర్ పైన దృష్టి సారించారు.
ఆమె మొదటి తమిళ్ టెలి ఫిల్మ్ నో పార్కింగ్. 2013లో అట్లీ దర్శకత్వంలో వచ్చిన రాజా-రాణి సినిమాతో సినిమాల్లోకి వచ్చారు. అప్పటి నుండి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. తమిళ్ బిగ్ బాస్ 3లోను కాంటెస్ట్ చేశారు.