»Rythu Palabhishekam For The Warangal Cp Ranganath Distribution Of Sweets To The Locals At Narsampet Warangal
Warangal CP Ranganath: చిత్రపటానికి రైతు పాలాభిషేకం…స్థానికులకు స్వీట్ల పంపిణీ!
ఓ రైతు ఓ పోలీస్ కమిషనర్(Warangal CP ranganath) చిత్ర పటానికి పాలాభిషేకం చేసి స్థానికులకు స్వీట్లు కూడా పంచాడు. అదేంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట(narsampet)లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాలేమిటో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
ఓ రైతు(farmer) వరంగల్ పోలీస్ కమిషనర్(Warangal CP ranganath) చిత్ర పటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించాడు. అన్నదాత అలా ఎందుకు చేశాడో ఇక్కడ తెలుసుకుందాం. అయితే నర్సంపేట(narsampet)కు చెందిన నాడెం వీరస్వామికి రెండు ఎకరాల భూమి ఉంది. దానిలో 20 గుంటల ల్యాండ్ ను.. 2018 మేలో ఏనుగల్లు తండాకు చెందిన బ్యాంకు ఉద్యోగి బానోత్ అనిల్ భార్య, అతని సోదరుడు సునీల్ కు అమ్మాడు. ఆ క్రమంలో భూమికి హద్దులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన భూమిలో వీరస్వామి వ్యవసాయం చేసుకుంటున్నాడు.
ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల తర్వాత వారు ఇంకో 10 గుంటల భూమి అమ్మాలని ఒత్తిడి చేస్తున్నట్లు రైతు వాపోయాడు. అయితే తనకు మిగతా భూమి(land) అమ్మడం(sale) ఇష్టం లేదని రైతు వారికి చెప్పాడు. అయినా రైతు వినకపోవడంతో అతనిపై దాడికి ప్రయత్నించారు. అతను వేసుకున్న పొలాన్ని కూడా ధ్వంసం చేసి హద్దు రాళ్లు తీసేశారు. దీంతోపాటు వారినే కులం పేరుతో దూషించారని ఫిబ్రవరి 27న అనిల్, సునీల్ నర్సంపేట(narsampet) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ నేపథ్యంలో ఆ రైతు(farmer)పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని వీరస్వామి సీపీ రంగనాథ్(Warangal CP ranganath) కు కంప్లైంట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన సీపీ..డీసీపీని సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేయాలని ఆదేశించారు. దీంతో విచారణలో వీరస్వామిపై తప్పుడు కేసు నమోదైనట్లు తేలింది. దీంతో సీపీ రంగనాథ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రైతుపై కేసును తొలిగించాలని చెబుతూ..బానోత్ సునీల్, అనిల్ సహా మరో 11 మందిపై కేసు(case) నమోదు చేశారు. సీపీ రంగనాథ్ ఎంట్రీతో తనకు న్యాయం జరగడంతో ఆ రైతు సంతోషం వ్యక్తం చేశాడు. అంతటితో ఆగలేదు. నర్సంపేట అమరవీరుల స్తూపం దగ్గర సీపీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్థానికులకు స్వీట్లు పంచాడు. మరోవైపు సీపీ చేసిన పనికి స్థానికులతోపాటు నెటిజన్లు కూడా మెచ్చుకుంటున్నారు.