తెలుగు రాష్ట్రాల్లో మెడికో విద్యార్థి ప్రీతి కేసు(Medico Preeti Case) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో డాక్టర్ ప్రీతి మృతిపై వరంగల్ సీపీ రంగనాథ్ (CP Ranganath) కీలక ప్రకటన చేశారు. డాక్టర్ ప్రీతిది ఆత్మహత్యే(Suicide)నని వెల్లడించారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే ప్రీతి చనిపోయిందన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కూడా ఇది రుజువైనట్లు తెలిపారు. ప్రీతి ఆత్మహత్యకు గల ప్రధాన కారణం సైఫేనని సీపీ వెల్లడించారు.
సీపీ రంగనాథ్(CP Ranganath) మీడియా సమావేశంలో మాట్లాడుతూ..సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి(Preeti) ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. మరో పది రోజుల్లో ప్రీతి కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్‌ను దాఖలు చేస్తున్నట్లు సీపీ రంగనాథ్ వెల్లడించారు. కేఎంసీలో అనస్థీషియా విభాగంలో పీజీ చదువుతున్న ప్రీతికి తన సీనియర్ అయిన సైఫ్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. అవి భరించలేక ప్రీతి ఎంజీఎంలో ఆత్మహత్య(Suicide) చేసుకుంది.
మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించి ప్రీతి(Preeti)కి చికిత్స అందించారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మరోవైపు ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె కుటుంబీకులు ఆరోపణలు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించి ఛార్జీ షీట్ ను ఫైల్ చేయనున్నట్లు సీపీ రంగనాథ్(CP Ranganath) వెల్లడించారు.