»Rumors On Telugu Actor Kota Srinivasa Rao Health Condition
Kota Srinivasa Rao: కోటశ్రీనివాసరావు మరణించాడంటూ వార్తలు..కొట్టిపారేసిన కోట
టాలీవుడ్(Tollywood) సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు(Kota srinivasa Rao) గురించి తెలియని తెలుగు ప్రేక్షకులంటూ ఎవ్వరూ ఉండరు. తెలుగుతో పాటుగా ఈ దిగ్గజ నటుడు దక్షిణాదిలోని అన్ని భాషల్లోని నటించి ప్రేక్షకుల దగ్గరయ్యారు. విలక్షణ నటనతో సినీ ప్రేమికులను ఆకట్టుకున్నారు. విలన్(Villan)గా భయపెట్టడంలోనైనా, కామెడీ(Comedy) చేసి కడుపుబ్బా నవ్వించడంలోనైనా ఆయన నటన అద్భుతం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి కన్నీళ్లు తెప్పించడంలో కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) స్టైలే వేరని చెప్పాలి.

సినీ రంగంలో రాణించాలనుకునే చాలా మందికి కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) స్ఫూర్తిగా నిలిచారు. వయస్సు మీద పడుతున్న కొద్దీ ఇప్పటికీ యాక్టింగ్ చేస్తూనే ఉన్నారు. యువ నటీనటులకు ఆదర్శంగా కోట శ్రీనివాస రావు నిలిచారు. అయితే కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) మరణించాడంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.
సోషల్ మీడియాలో కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) మరణించారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఈ వార్తలపై కోట స్పందించారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఆయనే స్వయంగా చెప్పారు. తన ఆరోగ్యం(Health) బావుందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కోట శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) క్లారిటీ ఇచ్చారు. తప్పుడు వార్తలను ఎవ్వరూ నమ్మొద్దని కోట శ్రీనివాస రావు స్వయంగా వివరణ ఇచ్చారు. దీంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.