Mahesh Babu : SSMB 28 టైటిల్ అప్డేట్పై సాలిడ్ క్లారిటీ!
Mahesh Babu : SSMB 28 నుంచి ఉగాదికి బిగ్ అప్డేట్ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈనెల 22న టైటిల్‌తో పాటు గ్లింప్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. దీని పై క్లారిటీ ఇవ్వాలంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీంతో తాజాగా మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
SSMB 28 నుంచి ఉగాదికి బిగ్ అప్డేట్ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈనెల 22న టైటిల్‌తో పాటు గ్లింప్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. దీని పై క్లారిటీ ఇవ్వాలంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీంతో తాజాగా మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. సరైన సమయంలో ఈ మూవీ నుండి అప్డేట్ అందిస్తాము.. అంటూ హారికా, హాసిని క్రియేషన్స్ వారు తమ అఫీషయల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలిపారు. దీంతో ఉగాదికి ఎస్ఎస్ఎంబీ 28 అప్డేట్ లేనట్టే.. కాకపోతే సాలిడ్ హింట్ ఇచ్చారు మేకర్స్. ఈ పోస్ట్‌లో బాణం సింబల్ ఎమోజి యాడ్ చేయడంతో.. ఎస్ఎస్ఎంబీ టైటిల్ టైం ఇదేనంటూ ఫిక్స్ అయిపోయారు. శ్రీరామనవమి కానుకగా అప్డేట్ రానుందనే క్లారిటీ వచ్చేసినట్టేనని అంటున్నారు. అయితే ఆ రోజు టైటిల్ మాత్రమే రివీల్ చేస్తారా.. లేదంటే గ్లింప్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా.. అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా భారీ ట్రీట్ ఇవ్వడం పక్కా. ఇక అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ఇదే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా, హాసిని క్రియేషన్స్ వారు భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాంతో మొదటి నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను ఆగష్టు 11న రిలీజ్ చేస్తామని అంటున్నా.. మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది.