»Rrr Duo Ntr Ram Charan Becomes Oscars Academy Members
Ramcharan, NTR: గ్లోబల్ స్టార్స్ తారక్, చరణ్ లకు అరుదైన ఘనత
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ (Oscars) ఈ సంవత్సరం తమతో చేరిన 398 మంది కొత్త సభ్యుల తాజా జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టేలర్ స్విఫ్ట్, కే హుయ్ క్వాన్ వంటి అంతర్జాతీయ స్టార్లతోపాటు ఆస్కార్ విన్నింగ్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఉన్నారు.
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ఎంత సంచలనం సృష్టించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అంతే కాకుండా వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. `నాటు నాటు` పాటకు గానూ హాలీవుడ్ స్టార్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ పురస్కారాలని దక్కించుకుని భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త చరిత్రను లిఖించింది. హాలీవుడ్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా నిలిచింది. హాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ల ప్రశంసల్ని దక్కించుకున్న ఈ చిత్ర టీమ్‌కు తాజాగా అరుదైన గౌరవం దక్కింది.
వచ్చే ఏడాది ఆస్కార్ 96వ అవార్డుల వేడుక జరగనుంది. దీని కోసం కమిటీ ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఇందు కోసం ఆస్కార్ కమిటి కొత్తగా 398 మందిన జ్యూరి మెంబర్స్‌గా ఎంపిక చేసుకుంది. దీంతో ఆస్కార్ కమిటీ(Oscar Academy committee Members)లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీల మొత్తం సంఖ్య 10,817కు చేరింది. అయితే ఈ సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ టీమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఆస్కార్ కమిటీ ఎంపిక చేసిన 398 మంది జ్యూరీ సభ్యుల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ మెంబర్స్ స్థానాన్ని దక్కించుకున్నారు.
ఆర్ఆర్ఆర్(RRR) టీమ్ నుంచి రామ్ చరణ్(ram charan), ఎన్టీఆర్(jrntr), కీరవాణి, చంద్రబోస్, కెమెరామెన్ కె.కె.సెంథిల్ కుమార్, ప్రాజెక్ట్ డిజైనర్ సాబుసిరిల్ ఎంపికయ్యారు. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ మరోసారి వార్తలలో నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు నెట్టింట హంగామా చేస్తున్నారు. మన వారికి ఆస్కార్ కమిటీలో చోటు దక్కడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆస్కార్ జ్యూరీలో దర్శకుడు రాజమౌళికి మాత్రం చోటు దక్కకపోవడంతో కొంత మంది అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.