బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ దేశంలో అత్యధిక పారితోషికం పొందే హీరోయిన్లలో ఒకరు. ఈ భామ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది.
మహారాష్ట్ర బాంబేలో నటుడు శక్తి కపూర్ కు జన్మించిన ఈ ముద్దుగుమ్మ స్కూల్ స్థాయిలో టైగర్ ష్రాఫ్, అథియా శెట్టితో కలిసి చదువుకుంది.
స్కూల్ స్థాయిలో డాన్స్ తో అనేక ప్రదర్శనలు చేసింది. దీంతోపాటు ఫారెన్ వెళ్లి కపూర్ బోస్టన్ యూనివర్శిటీలో సైకాలజీ చేసింది.
ఆ క్రమంలో కపూర్ తన పాఠశాల నాటక ప్రదర్శనలలో ఒకదాన్ని చూసిన తర్వాత సల్మాన్ ఖాన్ తన మొదటి చిత్రం లక్కీ: నో టైమ్ ఫర్ లవ్ (2005) ఆఫర్ చేశారు. అప్పుడు శ్రద్ధా ఏజ్ కేవలం 16 ఏళ్లు మాత్రమే.
ఆ తర్వాత 2010లో తీన్ పట్టిలో యాక్ట్ చేసింది. ఈ మూవీ హిట్టు కావడంతో ఈ భామకు ఆఫర్లు పెరిగాయి.
తర్వాత లవ్ కా ది ఎండ్ (2011), ఆషికి 2 (2013), హైదర్ (2014), ఏక్ విలన్ (2014), ABCD 2 (2015), బాఘీ (2016), స్ట్రీ (2018), సాహో (2019), ఛిచోరే (2019), తు ఝూతీ మైన్ మక్కార్ ( 2023) వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకుంది.
సినిమాల్లో నటించడంతో పాటు, కపూర్ అనేక సినిమాల్లో పాటలను కూడా పాడింది.
దీంతోపాటు ఈ బ్యూటటీ అనేక బ్రాండ్లు, ఉత్పత్తులకు ప్రచారం చేస్తుంది.