»Revanth Reddy Hot Comments On Party Senior Leaders
Revanth Reddy: మా పార్టీలోని ‘వారు’ కేసీఆర్ కు అమ్ముడుపోయారు
తమ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు (senior congress leaders) భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి (Chief Minister of Telangana) కే చంద్రశేఖర రావుకు (K Chandrasekhar Rao)కు అమ్ముడు పోయారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు (Telangana Congress President) రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన ఆరోపణలు చేసారు.
తమ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు (senior congress leaders) భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి (Chief Minister of Telangana) కే చంద్రశేఖర రావుకు (K Chandrasekhar Rao)కు అమ్ముడు పోయారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు (Telangana Congress President) రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ లోకి త్వరలో భారీగా చేరికలు ఉంటాయని చెప్పారు. కొంతమంది నాయకులు అభ్యంతరాలు పెట్టినా, వద్దని వారించినా… చేరికలను ఆపొద్దని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారని అన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు డీ శ్రీనివాస్ (D Srinivas) చేరిక అధిష్టానం పరిధిలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత (Congress LP) మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) చేపట్టిన యాత్ర ఏఐసీసీ కార్యక్రమం అని, ఆ పాదయాత్రలో (Padayatra) తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) గెలిచే పరిస్థితి ఏమాత్రం లేదని, అసలు కేసీఆర్ ను (KCR) తాము సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. ప్రస్తుత సర్వేల (Survey) ప్రకారం కాంగ్రెస్ తెలంగాణలో (Congress in Telangana) రెండో స్థానంలో ఉందని చెప్పారు. సర్వేలలో 32 శాతం నుండి 34 శాతం ఓటింగ్లో ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు తమ దృష్టి అంతా రాష్ట్రంలో అధికారంలోకి రావడం పైన ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ పైన ఫోకస్ పెట్టినట్లు వెల్లడించారు.
మరో ఏడెనిమిది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధిస్తున్నారు. అలాగే 2024 లోకసభ ఎన్నికల్లోను (Lok Sabha Elections 2024) తమ పార్టీ 150కి పైగా స్థానాలు గెలుచుకొని, కేంద్రంలో అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తమ పార్టీ నుండి టిక్కెట్ లను ముందుగానే ప్రకటిస్తామన్నారు. తాను కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావిస్తున్నానని, అయితే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. తమ సమావేశాలకు హాజరు కావద్దని బీఆర్ఎస్ నాయకులు రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
కవిత మీద సంజయ్ వ్యాఖ్యలపై…
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (BJP Telangana chief) బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన వ్యాఖ్యల మీద కూడా రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. బీజేపీ , బీఆర్ఎస్ (BJP X BRS) నేతలు వ్యూహాత్మకంగా తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తున్నారన్నారు. రూ.100 కోట్ల కోసం రాద్దాంతం చేస్తున్న బీజేపీ నాయకులు… బీఆర్ఎస్ కు వచ్చిన వెయ్యి కోట్ల నిధుల విషయంలో స్పందించడం లేదని మండిపడ్డారు. బండి సంజయ్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని నిలదీశారు.