అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి(Sarath Chandra Reddy)కి ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) కేసులో బెయిల్ మంజూరైంది. రౌజ్ అవెన్యూ కోర్టు ఈ మేరకు ప్రకటించింది. అయితే ఆరోగ్యం కారణాల రీత్యా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బైయిల్ పై ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు వెల్లడించింది.
మరోవైపు అతని భార్య చికిత్స కోసం కాకుండా హైదరాబాద్ దాటి వెళ్లకూడాదని కోర్టు పేర్కొంది. దేశం దాటి వెళితే చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతేకాదు మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంచుకోవాలని, లొకేషన్ కూడా ఎప్పుడూ ఆన్ లో ఉంచాలని షరతులు విధించింది. ఇంకోవైపు సాక్షులను బెదిరించడం లాంటి కార్యకలాపాలకు కూడా పాల్పడవద్దని తెలిపింది.